- ఆండ్రాయిడ్ యాప్‌లు కూడా ఆపరేట్ చేయవచ్చు
- డిసెంబర్ నుండి ఉచితంగానే అందుబాటులోకి
సాప్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త ఆపరేటింగ్ సిస్టం “విండోస్ 11” వెర్షన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. విండోస్ 10తో పోలిస్తే విండోస్ 11 సరికొత్త హంగులతో ఉంటుందని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
ఆండ్రాయిడ్ యాప్‌లు కూడా ఆపరేట్ అయ్యేలా ఈ విండోస్-11ను మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చింది. స్నాప్ లే అవుట్, స్నాప్ గ్రూప్ సహా మల్టీ టాస్కింగ్‌కు ఇందులో వీలు కల్పించింది. వీటితో పాటు టాస్క్‌బార్‌లో ఐకాన్స్ స్థానాన్ని మైక్రోసాఫ్ట్.. చివరి నుంచి మధ్యలోకి తీసుకొచ్చింది.
విండోస్ 10 నుంచి విండోస్ 11కి ఉచితంగానే అప్‌గ్రేడ్ కావొచ్చని సంస్థ తెలిపింది. సీఈఓ సత్య నాదెళ్ల మాట్లాడుతూ విండోస్ 11 చరిత్రలో ఒక మైలురాయిని సూచిస్తుందన్న ఆయన.. ఇది కొత్త తరం ఆరంభమని వ్యాఖ్యానించారు. రాబోయే10 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వెర్షన్ ను విడుదల చేసినట్లు సత్య నాదెళ్ల తెలిపారు