WIMBLEDON : జకోవిచ్ vs అల్కరాస్

హైదరాబాద్ (జూలై – 16) : వింబుల్డన్ 2023 పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలుస్తారో ఈరోజు తేలనంది. నెంబర్ – 1 ర్యాంకర్ అల్కరాస్ తో నెంబర్ – 2 ర్యాంకర్ జకోవిచ్ (Alcaraz Garfia vs Djokovic) ఈరోజు ఫైనల్లో తలబడునున్నారు.

ఇప్పటికే 23 టైటిళ్లతో అత్యధిక గ్రాండ్ స్లాములు గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన జకోవిచ్ కు ఈ ఫైనల్ గెలిస్తే 24 టైటిళ్లతో అగ్రస్థానంలో ఉన్న మార్గరెట్ కోర్ట్ రికార్డు సమం చేస్తాడు.

అలాగే 2018 నుంచి ఇంతవరకు ఎనిమిది ఫైనల్స్ లో ఏడు విజయాలతో జకోవిచ్ దూకుడు మీద ఉన్నాడు. యువ సంచలనం అల్కరాస్ జకో దూకుడును ఆపుతాడో లేదో ఈరోజు తేలనుంది.