BIKKI NEWS (DEC. 17) : white ration cards issue after sankranthi . సంక్రాంతి తరువాత 10 లక్షల కొత్త తెల్లరేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. తద్వారా 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. దీంతో ఏటా రూ.956 కోట్ల మేరకు ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని చెప్పారు.
white ration cards issue after sankranthi .
రేషన్‌కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారని సోమవారం శాసనమండలిలో సభ్యులు కోదండరాం, మీర్జా రియాజుల్ హసన్ అడిగిన ప్రశ్నకు మంత్రి పైవిధంగా బదులిచ్చారు.
కొత్త కార్డులకు ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేను కూడా ఆధారంగా చేసుకుంటామని చెప్పారు. తెల్ల రేషన్‌కార్డులకు చిప్‌ను జోడిస్తామని తద్వారా స్మార్ట్‌కార్డులను జారీచేయబోతున్నట్లు వివరించారు.
ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో అదనపు పేర్ల నమోదుకు మీ సేవ కేంద్రం ద్వారా గత పదేళ్లుగా వచ్చిన 18 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని తన నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియమించిన విషయాన్ని మంత్రి వివరించారు.
ఉపసంఘం పలుమార్లు సమావేశమై చర్చించిందన్నారు. కార్డుల మంజూరు ప్రక్రియలో సుప్రీంకోర్టుకు సక్సేనా కమిటీ సమర్పించిన సిఫారసులను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. అలాగే రేషన్‌కార్డుల జారీ ప్రక్రియలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల నుంచి సేకరించిన సూచనలను కూడా ఉప సంఘం పరిగణనలోకి తీసుకున్నట్లు ఉత్తమ్ తెలిపారు.
వీటన్నింటినీ అధ్యయనం చేసిన ఉపసంఘం కొత్త రేషన్ కార్డుల మంజూరీకి అర్హతా ప్రమాణాలు నిర్ణయిస్తూ కేబినెట్‌కు నివేదిక సమర్పిస్తుందని చెప్పారు.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 02 – 2025
- NEET UG 2025 NOTIFICATION – నీట్ యూజీ నోటిఫికేషన్, దరఖాస్తు లింక్
- GRAMMY AWARDS 2025 – గ్రామీ అవార్డులు 2025 పూర్తి జాబితా
- GK BITS IN TELUGU FEBRUARY 8th
- చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 08