వాట్సప్ కు భారత ప్రభుత్వం హెచ్చరిక.

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం ఘాటు లేఖ వ్రాసింది. వాట్సప్ ప్రవేశ పెట్టిన కొత్త ప్రైవ‌సీ పాల‌సీని వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని ఆ లేఖలో స్ప‌ష్టం చేసింది.

భార‌త వాట్సప్ యూజ‌ర్ల ప్రైవ‌సీని గౌర‌వించాల‌ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ వాట్సాప్ సీఈవో విల్ కాత్‌కార్ట్‌కు లేఖ రాసింది.

మా కొత్త పాల‌సీని అంగీక‌రించండి లేదంటే వాట్సాప్‌ను వ‌దులుకోండి అన్న వాట్సాప్ బెదిరింపులకు ప్ర‌భుత్వం తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ కేఎస్ పుట్ట‌స్వామి వ‌ర్సెస్ యూనియ‌న్ ఆఫ్ ఇండియా (2017) కేసును ప్ర‌స్తావించింది. ప్రైవ‌సీ, అంగీకార సూత్రాల‌కు విలువ ఇవ్వాల‌ని ఈ తీర్పు స్ప‌ష్టంగా చెప్పింద‌ని, దానిని మీరు గ‌మ‌నించాల‌ని వాట్సాప్‌కు స్ప‌ష్టం చేసింది.

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల‌కు ఇండియాలో చాలా మంది యూజర్లు ఉన్నార‌ని, ఈ నేపథ్యంలో వారి డేటాను సేక‌రిస్తే అది దేశంలోని కోట్లాది మంది భారత పౌరుల ప్రైవ‌సీకి భంగం క‌లిగించిన‌ట్లే అవుతుంద‌ని ఆ లేఖ‌లో ఐటీ శాఖ హెచ్చరించింది.

Follow Us@