Home > JOBS > HORIZONTAL – RESERVATION హరిజెంటాల్ రిజర్వేషన్లు అంటే ఏమిటి.?

HORIZONTAL – RESERVATION హరిజెంటాల్ రిజర్వేషన్లు అంటే ఏమిటి.?

BIKKI NEWS (FEB. 13) : తెలంగాణ రాష్ట్రం లో నియామకాలలో మహిళలకు హరిజెంటాల్ రిజర్వేషన్లు (WHAT IS HORIZONTAL RESERVATIONS ) అమలు చేయనున్న నేపథ్యంలో ఆ విధానం గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు అనుసరించిన వంద పాయింట్ల రోస్టర్‌ పట్టికలో మహిళలకు 33 1/3 శాతం పోస్టులను ఆయా వరుస క్రమంలో రిజర్వ్‌ చేసి (నిర్దిష్ట పాయింట్‌ కింద ఉన్న పోస్టును మహిళలకని ప్రత్యేకంగా మార్క్‌ చేసి) చూపించేవారు.

కానీ తాజా హారిజాంటల్‌ విధానంలో మహిళలకు ఎక్కడా పోస్టులను రిజర్వ్‌ చేయరు (ఎలాంటి మార్కింగ్‌ ఉండదు). భర్తీ సమయంలోనే ప్రతి మూడింటా ఒక్క పోస్టు ఫార్ములాతో నేరుగా నియామకాలు చేపడతారు. అందువల్ల సంబంధిత శాఖలన్నీ మహిళా రిజర్వేషన్‌తో కూడిన కొలువుల పట్టికను సవరించి కేవలం పోస్టుల వారీగా కొత్త పట్టిక తయారు చేసి నియామక సంస్థలకు సమర్పించాల్సి ఉంది.

ఉదాహరణకు గతంలో ఓ శాఖలో పది ఉద్యోగాలకు సంబంధించి 3 పోస్టులను మహిళలకు రిజర్వ్‌ చేసి పంపినట్లైైతే, తాజా నిబంధనల ప్రకారం ఆ రిజర్వేషన్‌ను తొలగించి పది పోస్టులను జనరల్‌కు కేటాయిస్తూ కొత్త పట్టిక తయారు చేయాలి. అయితే ఇక్కడ కమ్యూనిటీ రిజర్వేషన్లు మారవు. కేవలం మహిళలకు రిజర్వ్‌ చేసిన స్థానం సంబంధిత వర్గ జనరల్‌ కేటగిరీకి మారుస్తారు. ఇలా శాఖలన్నీ హారిజాంటల్‌ విధానంలో కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే తెలంగాణ రాష్ట్రంలో కొలువుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగనుంది.