తాత్కాలిక ఉద్యోగులకు నియామకాలలో వెయిటేజ్ : హరీష్ రావు

కరోనా సమయంలో తాత్కాలిక పద్ధతిలో సేవలందించిన వైద్య సిబ్బందికి ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీ ఇస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.

కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం కొందరు సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో సంవత్సరం ఒప్పందం మేరకు నియమించుకున్నదని, వారి అద్భుత సేవలను ప్రభుత్వం గుర్తించిందని, నియామకాల్లో వారికి వెయిటేజీ ఇస్తామని చెప్పారు. శనివారం అసెంబ్లీలో ఆరోగ్యశాఖ పద్దుపై చర్చ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Follow Us @