కాంట్రాక్టు అధ్యాపకులకు వెయిటేజ్ ఇచ్చి క్రమబద్ధీకరించండి – పీఆర్సీ నివేదిక.

ప్రభుత్వ జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించే విషయంలో తెలంగాణ తొలి పి ఆర్ సి – 2020 కమిటీ కీలక సూచనలు చేసింది.

ఈ కమిటీ సూచన లో భాగంగా గత 20 ఏళ్లుగా ప్రభుత్వ జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేటప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు సంబంధించిన పరీక్షలో వెయిటేజ్ ఇవ్వాలని, ఆ పరీక్షలో కాంట్రాక్టు అధ్యాపకులు చూపిన ప్రతిభ ఆధారంగా క్రమబద్ధీకరించాలని సూచించింది. వీరికి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీత భత్యాలు చెల్లించాలని పేర్కోంది.

ఈ పరీక్షలో క్వాలిఫై కానీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు యధావిధిగా అదే పోస్టులలో కాంట్రాక్టు అధ్యాపకులు గానే కొనసాగించాలని, వారికి బేసిక్ పే ఇవ్వాలని నివేదించింది.

Follow Us @