BIKKI NEWS (APRIL 04) : భూమి లోపల 700 కిలో మీటర్ల లోతులో మహా సముద్రాల కంటే ఎక్కువ నీరు (water at 700 km under earth on blue rock ) ఉందని అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు.
రింగ్వుడైట్ అనే ఒక ప్రత్యేకమైన రాతి ఉపరితలంలో ఈ నీరు ఉన్నట్టు వీరు చెప్తున్నారు. ఈ రాయిని బ్లూరాక్ అని కూడా పిలుస్తారు. ఈ రాయి స్పాంజి లాంటి స్వభావంతో ఉంటుందని, నీటిని పీల్చుకోవడం దీని ప్రత్యేకత అని, ఇది హైడ్రోజన్ ను ఆకర్షించి, నీటిని అదిమిపట్టుకుంటుందని పరిశోధకుల బృందంలో ఒకరైన స్టీవ్ జాకబ్సన్ తెలిపారు.
2014లో ఇందుకు సంబంధించిన విశేషాలతో ఒక సైంటిఫిక్ పేపరు సమర్పించారు. భూమి ఉపరితలం మీద ఉన్న అన్ని సముద్రాల నీటి కంటే భూమి లోపలి ఈ మహాసముద్రంలో మూడు రెట్లు ఎక్కువ నీరు ఉన్నదని వీరు గుర్తించారు.