TSRTC ITI : పదో తరగతితో అడ్మిషన్లు

వరంగల్ (జూలై 24) : వరంగల్ లోని TS RTC ITI కళాశాలలో మోటర్ మెకానిక్, డీజిల్ మెకానిక్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్లలో అడ్మిషన్లు కోసం పది, ఎనిమిదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

రెండు సంవత్సరాల పాటు కొనసాగే ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత కోరుకున్న ఆర్టీసీ డిపోలలో అప్రెంటీస్ షిప్ సౌకర్యం కల్పిస్తారు

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్దులు దరఖాస్తులను జూలై 31లోగా వరంగల్ ములుగు రోడ్డులోని ఆర్టీసీ ఐటీఐ కళాశాలకు పంపాలని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొన్నది.

విద్యార్థులు ప్రవేశాల కోసం వరంగల్ ములుగు రోడ్డులోని ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో లేదా, 984925319, 8008138611 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నది..