ఇంటర్మీడియట్ విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జెడి) గా శ్రీమతి జయప్రద భాయి పూర్తిస్థాయి బాధ్యతలను ఈరోజు వరంగల్ లోని ఆర్జెడి కార్యాలయంలో స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం 475 రాష్ట్ర మరియు వివిధ జిల్లాల నాయకులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్జెడి జయప్రద భాయిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ 475 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్. వస్కుల శ్రీనివాస్, వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్. ప్రవీణ్ కుమార్, జనరల్ సెక్రటరీ రాములు, వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్. బూర విజయమోహన్, జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షులు కొలిపాక భాస్కర్, జనరల్ సెక్రటరీ గణేష్, ములుగు జిల్లా జనరల్ సెక్రటరీ హరగోపాల్, రాష్ట్ర మహిళా కార్యదర్శులు రమాదేవి, సువర్ణ, మరియు వివిధ జిల్లాల కార్యవర్గ సభ్యులు సవ్వాసి శ్రీనివాస్, జగన్, శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొనడం జరిగింది.
Follow Us@