అలుగుబెల్లితో సీజేఎల్స్ సమస్యల పై 475 నేతలు భేటీ

వరంగల్ : ప్రస్తుతం కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఈరోజు 475 సంఘం వరంగల్ శాఖ నేతలు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.

ముఖ్యంగా బదిలీల సాధన, ల్యాప్స్ అయినా వేతన బడ్జెట్ కు అమోదం మరియు 10 శాతం టీడీఎస్ రూపంలో వేతనం నుండి కోత విధించడం వంటి సమస్యల మీద ఈ రోజు వస్కుల శ్రీనివాస్ నాయకత్వంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా 475 శాఖ అలుగుబెల్లి నర్సిరెడ్డి తో చర్చించి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నాయిని శ్రీనివాస్, డాక్టర్ కె. ప్రవీణ్ కుమార్, డాక్టర్ బి. విజయ మోహన్, రాజిరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.