టీట్వంటీ వరల్డ్ కప్ : శ్రీలంక బౌలర్ హ్యాట్రిక్

దుబాయ్ :: ఐసీసీ టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు సౌతాఫ్రికా – శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక బౌలర్ వానింద్ హర్షంగా హ్యాట్రిక్ నమోదు చేశాడు. 14.6, 17.1, 17.2 ఓవర్లలోని వరుస బంతుల్లో మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు.

టి20 వరల్డ్ కప్ లలో ఇది మూడవ హ్యాట్రిక్. ఈ వరల్డ్ కప్ లో ఇది రెండో హ్యాట్రిక్.

ఇంతకుముందు బ్రెట్ లీ (2007), కర్టిస్ కాంఫోర్ (2021) లు టీట్వంటీ వరల్డ్ కప్ లలో హ్యాట్రిక్ నమోదు చేశారు.

అలాగే వన్డేల్లోనూ, టీ20ల్లోనూ హ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్లలో వానింద్ హర్షంగా చేరారు. బ్రెట్ లీ, థిసారా పెరిరా, లసిత్ మలింగ లతో పాటు వానింద్ హర్షంగా ఈ క్లబ్ లో చేరాడు. శ్రీలంక నుంచే ఈ క్లబ్ లో ముగ్గురు బౌలర్లు ఉండడం విశేషం.

వానింద్ హర్షంగా హ్యాట్రిక్ నమోదు చేసినప్పటికీ సౌతాఫ్రికా మ్యాచ్ గెలవడం విశేషం.