గురుకుల పాఠశాలలో రిపోర్టింగ్ గడువు పెంపు

తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశం కోసం VTG CET వ్రాసి మొదటి మరియు రెండవ విడత కౌన్సిలింగ్ లలో సీట్లు పొందిన విద్యార్థులు పాఠశాలల్లో రిపోర్టింగ్ గడువు పెంచుతూ గురుకుల విద్యా శాఖ కమిషనర్, VTG CET కన్వీనర్ ప్రవీణ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.

మొదటి, రెండవ విడత కౌన్సెలింగ్ లో సీట్లు పొందిన ఐదవ తరగతి విద్యార్థుల పాఠశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో గడువును జనవరి – 8 – 2021 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున విద్యార్థులు జనవరి 8 లోపు పాఠశాలను సందర్శించి సర్టిఫికెట్లను సమర్పించ వలసిందిగా కోరడం జరిగింది. లేని పక్షంలో సీట్లు రద్దు కాబడతాయని ఆ సీట్లను వేరే విద్యార్థులకు కేటాయించబడతాయని తెలిపారు.

Follow Us@