VRA ల సర్దుబాటుకు మార్గదర్శకాలు విడుదల

హైదరాబాద్ (ఆగస్టు – 02) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఎల సర్దుబాటు ప్రక్రియను వేగవంతం చేసింది. విద్యార్హతలు, ఖాళీల ఆధారంగా వివిధ శాఖల్లోకి 20,555 మంది వీఆర్ఎలను సర్దుబాటు చేసే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. విద్యార్హతల మేరకు ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ ను వర్తింపజేసింది.

వీరిలో 61 ఏండ్లు దాటిన 3,797 మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్టుపేర్కొన్నది.

వయసు నిర్ధారణకు ఈ ఏడాది జూలై 1ని కటాఫ్ తేదీగా నిర్ధారించింది. అప్పటికి 61 ఏండ్లలోపు వయసున్నవారికి నేరుగా పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేశారు.

★ మార్గదర్శకాలు

ఖాళీల వివరాలను అన్ని జిల్లాల కలెక్టర్లు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ లో పొందుపర్చాలి.

ఆ ఖాళీల ఆధారంగా జిల్లాల్లో రెగ్యులర్, సూపర్ న్యుమనరీ పోస్టులను సృష్టించాలి.

విద్యార్హతల ఆధారంగా భర్తీ చేయాలి.

ఒకవేళ వీఆర్ఎల కన్నా ఖాళీలు తక్కువుంటే.. ఇతర జిల్లాల్లో సర్దుబాటు చేయాలి.

వీఆర్ఎల అపాయింట్మెంట్ పూర్తికాగానే తాసీల్దార్లు వీఆర్ఎలను రిలీవ్ చేయాలి. మార్పు, చేర్పులకు అవకాశం ఉండదు.

61 ఏండ్ల వయసు దాటిన వారి వారసులు ఎంపిక, వివరాలతో పాటు అఫిడవిట్ ను, కుటుంబ సభ్యుల నుంచి ఎన్వోసీ తప్పని సరిగా తీసుకోవాలి.

వారసుల ఎంపిక ప్రక్రియను ఆగస్టు 5లోగా పూర్తి చేయాలి.