12 నెలలు వేతనాలకై చర్యలు తీసుకోవాలని ఇంటర్ కమీషనర్ కి వినతి

  • ఇంటర్ వొకేషనల్ పార్ట్ టైమ్ జూనియర్ లెక్చరర్ ల వినతి
  • 29 సంవత్సరాల సేవలకు తగిన గుర్తింపు లేదని ఆవేదన.

గత 29 సంవత్సరాలుగా (1993నుండి) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వృత్తి విద్య (వొకేషనల్) కోర్సులలో పార్ట్ టైమ్ జూనియర్ లెక్చరర్స్ ఫుల్ టైమ్ పని చేస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం G.O.No.95., Dated:-25-06-2019. ప్రకారం ప్రతి సంవత్సరం 12 నెలలు, నెలకు 28,080/- రూపాయలు కన్సాలిడేటెడ్ పే గా చెల్లించవలసిందిగా జీవో ని విడుదల చేసిందని సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పోతు సుధాకర్ ఒక ప్రకటన లో తెలిపారు.

కానీ తెలంగాణ ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ దానికి సంబంధించి సపోర్టింగ్ ఆర్డర్స్ ను ఇంత వరకు విడుదల చేయలేదని దాని వలన తాము తీవ్రంగా ఆర్ధికంగా నష్టపోతున్నామని వాపోయారు.

మార్చి, ఏప్రియల్ 2021 మరియు మార్చి – 2022 నెలలకు సంబందించిన వేతనాలు మరియు 12 నెలలు వేతనాలు చెల్లించేలా ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు.

Follow Us @