ఆర్థికశాఖకు 411 మంది వొకేషనల్ అధ్యాపకుల ఫైల్

హైదరాబాద్ (ఆగస్టు 12) : తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయంలో కీలకముందడగు పడింది. 411 మంది వొకేషనల్ కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణ ఫైలు శుక్రవారం ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆర్థికశాఖకు పంపించారు.

గతంలో 184 మంది వొకేషనల్ అధ్యాపకులను క్రమబద్ధీకరించిన విషయం తెలిసిందే. వివిధ కారణాలతో 411 మంది వొకేషనల్ కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణ ఆలస్య అయింది.