కొండపాక జూనియర్ కళాశాలను సందర్శించిన ఇంటర్ విద్యాధికారి హిమబిందు

కరోనా విపత్కర పరిస్థితుల్లో కళాశాలలు నడవకపోవడం వలన ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా విద్యాబోధన జరుగుతున్న విషయం తెలిసిందే. ఆన్లైన్ విద్యాబోధన ఏవిధంగా ఉంది అనే విషయంపై మరియు విద్యా సంవత్సర తనిఖీల్లో భాగంగా సిద్దిపేట జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీమతి హిమబిందు కొండపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తనిఖీ నిర్వహించి, ఆన్లైన్ ద్వారా విద్యాబోధన జరుగుతున్న తీరును అడిగి తెలుసుకోవడం జరిగింది.

ఈ తనిఖీలలో బాగంగా కళాశాలలో వివిధ రిజిష్టర్స్ పరిశీలించడం జరిగింది. త్వరలో జరగబోయే ఇంటర్ విద్యార్థుల వార్షిక పరీక్షల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ కి సూచించడం జరిగింది.

ఈ సందర్భంగా కళాశాలకు విచ్చేసినటువంటి ఇంటర్ విద్యాధికారికి కళాశాల బృందం తరపున శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఇందిరా దేవి కళాశాల సిబ్బంది గాదె వెంకన్న, శశిధర్ రెడ్డి, రాములు, సత్యనారాయణ, పాపయ్య, శ్రీలీల, అనిత, రాజ్యలక్ష్మి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us@