లక్నో (మే – 01) : విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ల మద్య వాగ్వాదానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – లక్నో సూపర్ జెయింట్స్ చెట్ల మధ్య జరిగిన మ్యాచ్ వేదిక అయింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో గెలిచింది.
RCB మ్యాచ్ గెలిచిన అనంతరం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. 30 నిమిషాలకు పైగా ఈ వివాదం జరిగింది.ఇరుజట్ల క్రీడాకారులు గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీలను సమూదాయించడంతో వివాదం సద్దుమణిగింది.
గత మ్యాచ్ లో ఆర్సీబీ పై లక్నో జట్టు గెలవడంతో గంభీర్ ప్రేక్షకులను ఉద్దేశించి చేసిన సైగలకు ప్రతీకారంగా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ప్రతి సందర్భంలో దీటుగా స్పందించడంతో మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ గొడవ జరిగిన నేపథ్యంలో రిఫరీ వారిద్దరి మ్యాచ్ ఫీజులో ఏకంగా 100 శాతం ఫైన్ విధించారు. అలాగే గొడవకు కారణమైన లక్నో ఆటగాడు నవీన్ ఉల్ హక్కు 50 శాతం ఫైన్ విధించారు. ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, త్వరలో వీరితో రిఫరీ స్వయంగా మాట్లాడనున్నట్లు సమాచారం.