హైదరాబాద్ (ఫిబ్రవరి – 20) : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ 2వ ఇన్నింగ్స్‌లో 20 పరుగులతో అంతర్జాతీయ క్రికెట్‌లో 25,000 పరుగులు (virat kohli 25k runs in international career) దాటాడు. ఈ మైలురాయిని చేరిన ఆరో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.
విరాట్ కోహ్లీ 106 టెస్టుల్లో 8,195 పరుగులు, 271 వన్డేల్లో 12,809, 115 టీ20ల్లో 4,008 పరుగులు చేశాడు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా కూడా విరాట్ కోహ్లీ నిలిచాడు.
★ అత్యధిక పరుగుల వీరులు :
సచిన్ టెండూల్కర్ – 34,357 (664 మ్యాచ్‌లలో)
కుమార సంగక్కర – 28,016 (594 మ్యాచ్‌ల్లో)
మహేల జయవర్ధనే – 25,957 (652 మ్యాచ్‌ల్లో)
రికీ పాంటింగ్ – 27,483 (560 మ్యాచ్‌లు)
జాక్వెస్ కల్లిస్ – 25,534 (519 మ్యాచ్‌లలో)