బెంగళూరు (మే – 21) : ఐపీఎల్ లో చివరి లీగ్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ తో విరాట్ కోహ్లీ సెంచరీ (101*) నమోదు చేశాడు. ఇది ఐపీఎల్ లో అతనికి ఏడవ సెంచరీ. అత్యధిక సెంచరీలు జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. క్రిస్ గేల్ ఆరు సెంచరీలు, బట్లర్ ఐదు సెంచరీలతో తర్వాత స్థానాల్లో నిలిచారు.
ఈ ఐపీఎల్ లో వరుసగా విరాట్ కోహ్లీకిది రెండవ సెంచరీ కావడం విశేషం..
మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 197 పరుగులు చేసింది.