కోల్‌కతా (నవంబర్ – 15) : VIRAT KOHLI 50th CENTURY… అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లలో విరాట్ కోహ్లీ 50వ సెంచరీ సాధించాడు. దీంతో సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న 49 సెంచరీల రికార్డు ను అధిగమించాడు.
న్యూజిలాండ్ తో జరుగుతున్న కీలకమైన ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించడం విశేషం
అలాగే ఒక వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ పేరు మీదే ఉన్న రికార్డు (673) పరుగుల రికార్డు ను అధిగమించి ప్రస్తుతం 711* పరుగులు సాదించాడు.
వరుసగా 50+ పరుగుల రికార్డు కూడా సచిన్ టెండూల్కర్ 1996 వరల్డ్ కప్ లో 5 సార్లు సాదించాడు. దానిని ఈ వరల్డ్ కప్ లో కోహ్లీ 6 సార్లు సాదించి అధిగమించాడు.
అలాగే అంతర్జాతీయ మ్యాచ్ లలో అత్యధిక 50+ పరుగులను సాదించిన రికీ పాంటింగ్ రికార్డు (217) ను సమం చేశాడు. దీంతో అత్యధిక సార్లు 50+ పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ (264 ) మొదటి స్థానంలో ఉన్నాడు.