డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడిగా ఎం. వినోద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక

తెలంగాణ డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం. వినోద్ కుమార్ నే మరొక్కమారు సీడీఎల్స్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆన్లైన్ ద్వారా ఓటింగ్ లో మరో రెండు సంవత్సరాల పాటు ఎం. వినోద్ కుమార్ అధ్యక్షతకు 95% డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ లు మద్దతు పలికారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ బాధ్యత మరింత పెరిగిందని, ఇంకాస్త శ్రమతో డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యల సాధనలో తమ వంతు రాష్ట్ర కమిటీ సహకారంతో ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా తనకు మద్దతు పలికిన లెక్చరర్ లకు, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏమ్మెల్సీ పెద్దలు డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, కూర రఘోతం రెడ్డి, జనార్దన్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు

ఈ సందర్భంగా కమిషనర్ నవిన్ మిట్టల్ మరియు CCE అధికారుల యొక్క సహకారంతో ఇంకా సమస్యల సాధనలో సర్వీస్ క్రమబద్ధీకరణ జరిగే వరకు ఉద్యోగ భద్రత, నెల నెలా వేతనాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.