14,954 సూపర్ న్యుమరరీ పోస్టులకు అమోదం

హైదరాబాద్ (ఆగస్టు – 04) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (VRAREGULARIZATION) ను ప్రభుత్వంలోకి విలీనం చేసుకొని వివిధ శాఖలలో లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్/ జూనియర్ అసిస్టెంట్- రికార్డ్ అసిస్టెంట్ వంటి పోస్టులలో వాళ్ళ అర్హతలను బట్టి క్రమబద్ధీకరణ చేస్తున్న నేపథ్యంలో 14,954 సూపర్ న్యుమరరీ పోస్టులను క్రియేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

61 ఏళ్లు లోపు ఉన్న 16,758 మంది వీఆర్ఏలు మరియు 61 ఏళ్లు దాటిన వీఆర్ఏల వారసులు 3797 మందిని క్రమబద్ధీకరిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.