VRA ల బదలాయింపు ఉత్తర్వులు విడుదల

హైదరాబాద్ (ఆగస్టు – 10) : తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయకులను (VRA) వివిధ శాఖలకు బదలాయిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఎ) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మొత్తం 14,954 మందిని జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లుగా వర్గీకరించి, పోస్టులు, జిల్లాల వారీగా ఆయా శాఖల్లో చేర్చుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొద్దిరోజుల్లో నీటిపారుదల శాఖలోనూ సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేస్తామని సీసీఎస్ఏ తెలిపారు.