Home > TELANGANA > VIDYA BHAROSA CARDS – నిరుద్యోగులకు 5 లక్షలతో కార్డులు

VIDYA BHAROSA CARDS – నిరుద్యోగులకు 5 లక్షలతో కార్డులు

BIKKI NEWS (DEC 17) : క్రెడిట్, డెబిట్ కార్డు తరహాలో విద్యార్థులకు యువ వికాసం పథకంలో భాగంగా 5 లక్షల రూపాయల పరిమితితో విద్యాభరోసా కార్డులను (VIDYA BHAROSA CARDS FOR TELANGANA UNEMPLOYEES) అందజేస్తామని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. విద్యాభరోసా కార్డులో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తామని చెప్పారు.

ఇందుకు సంబంధించి విధివిధానాలు త్వరలోనే ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కార్డుతో నిరుద్యోగులు కోచింగ్, ట్రైనింగ్, చిన్న వ్యాపారాలు పెట్టుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అర్హతలు, నిబంధనలు విడుదల చేసే అవకాశం ఉంది.

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని రామ్మెహన్ రెడ్డి ప్రవేశపెట్టగా, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి బలపరిచారు.