హైదరాబాద్(జూలై – 03) : తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం పదో తరగతిలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఇంటర్ చదువుతున్న 120 మంది పేద విద్యార్థులకు విద్యాదాన్ పేరిట సరోజిని దామోదరన్ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ అందజేయనుంది. ఇంటర్ లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున, వారు డిగ్రీలో చేరితే రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు స్కాలర్షిప్ ఇవ్వనుంది. VIDYA DHAN SCHOLARSHIP
★ అర్హతలు : పదో తరగతిలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి.
★ చివరి తేదీ : జూలై 31లోపు
★ వెబ్సైట్ : www.vidhyadhan.org
★ మరిన్ని వివరాలకు : 63003 91827