హైదరాబాద్ (మే – 29) : పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం 2023 – 24 విద్యా సంవత్సరానికి యానిమల్ హస్బెండరీ మరియు ఫిషరీస్ నందు రెండు సంవత్సరాల పాలిటెక్నిక్ కోర్సులలో (veterinary polytechnic courses admissions in telangana 2023) ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పాలిటెక్నిక్ 2023 ర్యాంక్ ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేయనుంది.
కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్నగర్, మామునూరు వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలల్లో యానిమల్ హజ్బెండరీ కోర్సుల్లో ప్రవేశాలు కోరుతున్నది. అలాగే భావదేవరపల్లి (AP) పాలిటెక్నిక్ కళాశాలలో ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుచున్నది.
◆ అర్హతలు : తెలంగాణకు చెందిన వారై, పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి, పాలిసెట్ – 2023లో ర్యాంకును కలిగి ఉండాలి.
◆ ఎంపిక విధానం : తెలంగాణ పాలిసెట్ 2023 ర్యాంక్ మరియు రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
◆ వయో పరిమితి : ఆగస్టు 31 – 2023 నాటికి 15 నుండి 22 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తు గడువు తేదీ : మే 29 నుండి జూన్ 19 – 2023 సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
◆ దరఖాస్తు ఫీజు : 750/- (SC,ST, PH – 350/_ )
◆ కావాల్సిన పత్రాలు : పాలీసెట్ 2023 హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, పదవ తరగతి మార్కుల మెమో ఒకటి నుండి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మొదలగునవి.