- తొలి అంతరిక్ష యాత్ర ఘనవిజయం
- బండ్ల శిరీష అరుదైన ఘనత
- అంతరిక్ష పర్యాటకానికి తొలి అడుగు
వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ బృందం వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ద్వారా నింగిలోకి దూసుకెళ్లింది. తెలుగమ్మాయి బండ్ల శిరీష సహా ఆరుగురు వ్యోమగాములతో న్యూమెక్సికో నుంచి వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యోమనౌక రోదసీలోకి పయనమైంది. దాదాపు గంట తర్వాత వ్యోమనౌక రోదసిలో ప్రయాణించి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది.
స్పేస్‌లో అడుగుపెట్టిన రెండో భారతీయ మహిళ కాగా.. ఓవరాల్‌గా నాలుగో ఇండియన్. మన దేశం తరఫున రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యక్తి కాగా.. కల్పనా చావ్లాతో పాటు మరో ఇండియన్-అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ కూడా ఈ ఘనత సాధించారు.
Follow Us @