బేసిక్ పే తో పాటు డీఏ హెచ్.ఆర్.ఏ కల్పించాలి కేటీఆర్ తో వస్కుల శ్రీనివాస్.

తెలంగాణ ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల 475 సంఘం తరఫున డాక్టర్ వస్కుల శ్రీనివాస్ మరియు బృందం కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ వస్కుల శ్రీనివాస్ కేటీఆర్ కి కాంట్రాక్ట్ అధ్యాపకులకు నూతన పీఆర్సీ ప్రకారం బేసిక్ పే కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బేసిక్ పే తో పాటు డీఏ మరియు హెచ్.ఆర్.ఏ కూడా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ త్వరలోనే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ వస్కుల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుందని, త్వరలోనే మిగతా సమస్యలను కూడా పరిష్కరిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ 475 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్. వస్కుల శ్రీనివాస్, రాష్ట్ర మహిళా కార్యదర్శులు రమాదేవి, జనగామ జిల్లా కార్యదర్శి గణపతి, ప్రధాన కార్యదర్శి గణేష్, వరంగల్ అర్బన్ జిల్లా జనరల్ సెక్రటరీ రాములు, మహబూబబాద్ జిల్లా లేడీ సెక్రటరీ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us@