పీఆర్సీ వర్తింపు పై కాంట్రాక్టు అధ్యాపకుల సంబరాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ప్రతిష్టాత్మకంగా మొదటిసారి పిఆర్సి ప్రకటించడం పట్ల కాంట్రాక్టు లెక్చరర్లు సంబరాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేస్తూ పిఆర్సి ఒప్పంద అధ్యాపకులకు కూడా వర్తింప చేయడం పట్ల తెలంగాణా గవర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ (475 ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కో-ఎడ్యుకేషన్ ధర్మకంచ నందు సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గతంలో పిఆర్సిని పొందాలంటే కాంట్రాక్టు అధ్యాపకులు పోరాటాలు చేయాల్సి వచ్చిందని అన్నారు. తమ కష్టాలను గ్రహించిన ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. ఏప్రిల్ 1, 2021 నుండి పెరిగిన జీతాలను కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా వర్తింపచేయడం శుభపరిణామం అన్నారు.
ఈ సందర్బంగా పిఆర్సి వర్తింప చేసేందులకు సహాయ, సహకారాలు అందించిన ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఆర్ధిక శాఖా మాత్యులు తన్నీర్ హరీష్ రావు, నూతన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డీలకు కాంట్రాక్టు అధ్యాపకుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా కళాశాలలో మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.


ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకులు మరిపెల్ల రవిప్రసాద్, సవ్వసి శ్రీనివాస్, మహమ్మద్ ఇంతియాజ్, ముక్తాదిర్, తిరుమల్లేష్, కాపర్తి శ్రీనివాస్, కదిరే రవీందర్, బిల్లా శంకర్, ఇశ్రత్ భాను, ప్రియదర్శిని, రేఖ, వరూధిని, షహనాజ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us@