ఉన్నత విద్యలో ఖాళీల పై వచ్చిన వార్తకు మా సంఘానికి సంబంధం లేదు – వినోద్ కుమార్

ఈ రోజు ఒక వార్త పత్రికలో ఉన్నత విద్యలో 4 వేల ఉద్యోగాలను నింపుతున్నట్లు వచ్చిన వార్తకు TGDCLA సంఘానికి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర అధ్యక్షుడు యమ్. వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

కేసీఆర్ ప్రభుత్వం మీద తమకు పూర్తి నమ్మకం ఉందని ఇంతకు ముందు చాలా సార్లు రెగ్యులర్ నోటిఫికేషన్ లో మా కాంట్రాక్టు అధ్యాపకుల పోస్టులు చూపించకుండా మిగిలిన వాటిని మాత్రమే భర్తీ చేస్తామని చాలా స్పృష్ణగా హామీ ఇచ్చారని తెలిపారు.

కావునా తాము ఏలాంటి అందళనకు గురి అవుతాలేమని , ఎలాంటి ఆందోళనలు చేసే ఉద్దేశ్యం కూడా లేదని, అధికారులను, ప్రభుత్వంను ప్రశ్నించాము అని వచ్చిన వార్తను ఖండిస్తున్నాము సంఘం తరపున వినోద్ కుమార్ ప్రకటించారు.

ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం వినోద్ కుమార్, జనరల్ సెక్రటరీ ఖాదరవల్లి, జాయింట్ సెక్రెటరీ శ్రద్దానందం, వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, అసోసియేట్ ప్రెసిడెంట్ అరుణ, బాలరాజు, మహేష్ కుమార్, వినయ్ కుమార్ తదితరులు ఈ వార్తను పూర్తిగా ఖండిస్తున్నట్టు ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయని తెలిపారు.