US OPEN 2024 -విజేత సబలెంకా

BIKKI NEWS (SEP. 09) : US OPEN 2024 WOMENS SINGLES WINNER SABALENKA. యూఎస్‌ ఓపెన్‌ 2024 మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను బెలారస్‌ క్రీడాకారిణి అరీనా సబలెంక గెలుచుకుంది. మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో సబలెంక.. 7-5, 7-5తో జెస్సిక పెగుల (యూఎస్‌ఏ)ను ఓడించింది.

US OPEN 2024 WOMENS SINGLES WINNER SABALENKA

రెండో సీడ్‌ సబలెంకకు ఇది మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కాగా యూఎస్‌ ఓపెన్‌ను గెలుచుకోవడం ఇదే మొదటిసారి. గతేడాది ఫైనల్‌లో అమెరికా అమ్మాయి కోకో గాఫ్‌ చేతిలో ఓడిన సబలెంక.. ఈసారి మాత్రం వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసి విజేతగా నిలిచింది.

ఈ విజయంతో 2016 తర్వాత ఒకే ఏడాది హార్డ్‌ కోర్ట్‌లో రెండు టైటిల్స్‌ (ఆస్ట్రేలియా ఓపెన్‌, యూఎస్‌ ఓపెన్‌) గెలిచిన తొలి క్రీడాకారిణిగా సబలెంక నిలిచింది. 2016లో జర్మనీ ప్లేయర్‌ కెర్బర్‌ ఈ ఘనత సాధించింది.

ప్రైజ్‌ మనీ 3,600,000 యూఎస్‌ డాలర్లు. భారత కరెన్సీలో సుమారు రూ. 30.23 కోట్లు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు