US OPEN 2023 : ఫైనల్ చేరిన మెద్వదేవ్

US OPEN 2023 (సెప్టెంబర్ – 09) : యుఎస్ ఓపెన్ రెండో సెమీఫైనల్ లో ప్రపంచ నెంబర్ 3 మెద్వదేవ్ ప్రపంచ నెంబర్ 2 ఆల్కరాజ్ పై ఘన విజయం సాధించి ఫైనల్ కు చేరాడు. యూఎస్ ఓపెన్ 2023 ఫైనల్ లో ప్రపంచ నెంబర్ వన్ జకోవిచ్ తో మెద్వదేవ్ తలపడనున్నాడు.

అల్కరాజ్ తో జరిగిన మ్యాచ్ లో మెద్వదేవ్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మొదటి రెండు సెట్లు అలవోకగా నెగ్గి, మూడో సెట్ ను అలకరాజ్ కు కోల్పోయాడు.. నాలుగో సెట్లో తిరిగి పుంజుకుని ఫైనల్ కు చేరాడు. 7-6, 6-1, 3-6, 6-3 తేడాతో గెలిచాడు. వింబుల్డన్ విజేత అయిన ఆల్కరాజ్ సెమి ఫైనల్ లోని ఇంటి దారి పెట్టాడు.

2021 యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన మెద్వదేవ్ 2023లో మరోసారి టైటిల్ గెలుస్తాడో లేదో చూడాలి.