US OPEN : కీలక దశకు చేరిన టోర్నీ

BIKKI NEWS : US OPEN 2023 కీలక దశకు చేరుకుంది. కీలక ఆటగాళ్లు సెమీస్ కు చేరుకున్నారు. భారత్ నుండి రోహన్ బోపన్న – మాథ్యూ ఎబ్డెన్ జోడి పురుషుల డబుల్స్ సెమి ఫైనల్ కు చేరారు.

ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ పురుషుల సింగిల్స్ విభాగంలో 47 వ సారి సెమీఫైనల్ కు చేరి అత్యధిక సార్లు సెమీఫైనల్ కు చేరిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. యూఎస్ ఓపెన్ సెమి ఫైనల్ కు చేరడం ఇది 18వసారి కావడం విశేషం.

మరోవైపు అమెరికాకు చెందిన బెన్ షెల్డన్ అన్ సీడెడ్ ఆటగాడిగా బరిలోకి దిగి సెమీఫైనల్ చేరడం విశేషం. గత 23 సంవత్సరాలలో పురుషుల విభాగంలో అన్ సీడెడ్ ఆటగాడు సెమి ఫైనల్ కీ చేరడం ఇది అయిదవ సారి మాత్రమే. బెన్ సెల్ సెమీఫైనల్ మ్యాచులో నోవాక్ జోకోవిచ్ తో తలపడనున్నాడు.

పురుషుల సింగిల్స్ మరో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు ఆల్కరాజ్… మెద్వదేవ్ తో తడపడనున్నాడు.

మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ అరీనా సబలెంక వరుసగా మూడో ఏడాది సెమీస్ కు కు చేరింది. మరోవైపు కరోలినా ముకోవా సెమీ ఫైనల్ కు చేరింది.