UPSC MAINS EXAM 2023 DATES

హైదరాబాద్ (ఆగస్టు – 01) : సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE 2023) సంబంధించి MAINS EXAMS DATES ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,105 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో జరపనున్నారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక పరీక్షలు మేలో నిర్వహించగా జూన్ లో ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరీక్షలు హైదరాబాద్, విజయవాడ నగరాల్లో జరుగనున్నాయి. మెయిన్స్ ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.