UPSC : ముగుస్తున్న ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినెషన్ గడువు

న్యూడిల్లీ (సెప్టెంబర్ – 26) : UNION PUBLIC SERVICE COMMISSION ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2024 (UPSC – ESE 2024 NOTIFICATION LAST DATE ) ప్రకటనను విడుదల చేసింది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా.. రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో 167 ఇంజినీరింగ్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క దరఖాస్తు గడువు నేటితో ముగుస్తుంది.

కావునా పోస్టును అనుసరించి బీఈ/ బీటెక్. లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) ఇన్స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణులై ఉన్న అభ్యర్థులు దరఖాస్తు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చేసుకోవచ్చు.

ఈ నోటిపికేషన్ కి సంబంధించిన ప్రిలిమినరీ/ స్టేజ్-1 పరీక్ష ఫిబ్రవరి 18 – 2024 న జరగనుంది.

వెబ్సైట్ : https://www.upsc.gov.in/