హైదరాబాద్ (ఎప్రిల్ – 27) : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్( UPSE CMSE 2023 NOTIFICATION) వివిధ విభాగాల్లో 1,261 మెడికల్ ఆఫీసర్/ జీడీఎంవో ఉద్యోగాల భర్తీకి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ప్రకటన వెలువడింది.
◆ పోస్టుల వివరాలు :
కేటగిరీ-1: మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ (జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ సబ్-క్యాడర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీస్): 584 పోస్టులు
కేటగిరీ-2: అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ (రైల్వే): 300 పోస్టులు
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్): 01పోస్టు,
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 (దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్): 376 పోస్టులు
◆ అర్హతలు : ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.
◆ వయోపరిమితి : 1.8.2023 నాటికి 32 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సడలింపు వర్తిస్తుంది.
◆ దరఖాస్తు ఫీజు : రూ.200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు మినహాయింపు)
◆ ఎంపిక విధానం : రాత పరీక్ష (500 మార్కులు), ఇంటర్వ్యూ (100 మార్కులు)లతో
◆ పరీక్ష తేదీ : జులై 16 – 2023
◆ తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.
◆ దరఖాస్తుకు చివరి తేదీ : మే 09 – 2023.