UPSC CDSE 2025 – 457 రక్షణ రంగ ఉద్యోగాలకు నోటిఫికేషన్

BIKKI NEWS (DEC. 13) : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 457 ఖాళీలతో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (UPSC CDSE – 2025 NOTIFICATION – I) ప్రకటన వెలువరించింది.

UPSC CDSE – 2025 NOTIFICATION – I

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్మీ నేవీ ఎయిర్ పోర్స్ లలో మంచి వేతనంతో ఉన్నత ఉద్యోగాలను పొందవచ్చు

అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 31 – 2024 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు : మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది. నేవల్ అకాడెమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్ వారు అర్హులు.

ఎయిర్ పోర్స్ పోస్టులకు డిగ్రీతోపాటు ఇంటర్ లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి. ఓటీఏ ఎస్ఎస్సీ నాన్ టెక్నికల్ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు. చివరి సంవత్సరం పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి : ఇండియన్ మిలటరీ అకాడెమీ, నేవల్ అకాడెమీలకు జనవరి – 02, 2001 – జనవరి – 1, 2006 మధ్య జన్మించినవారు అర్హులు.

ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు జనవరి – 2,, 2002 – జనవరి – 1, 2007 మధ్య జన్మించినవారు అర్హులు.

ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు జనవరి – 2,, 2002 – జనవరి – 1, 2006 మధ్య జన్మించినవారు అర్హులు.

ఎంపిక విధానం : మొదటి దశలో రాతపరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు : 200/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు లేదు)

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : డిసెంబర్ – 31- 2024 వరకు. (సాయంత్రం 6.00 గంటల వరకు)

దరఖాస్తు ఎడిట్ : జనవరి – 1 నుంచి 07 వరకు

పరీక్ష తేదీ : ఎప్రిల్ – 13- 2025

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.

నోటిఫికేషన్ & సిలబస్ : DOWNLOAD PDF

దరఖాస్తు లింక్ : APPLY HERE :

వెబ్సైట్ : https://upsc.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు