న్యూడిల్లీ (మే – 18) : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 349 ఖాళీలతో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CDSE – 2023) ప్రకటన వెలువరించింది.
◆ అర్హతలు : మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది. నేవల్ అకాడెమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్ వారు అర్హులు. ఎయిర్ఫోర్స్ పోస్టులకు డిగ్రీతోపాటు ఇంటర్ లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి. ఓటీఏ ఎస్ఎస్సీ నాన్ టెక్నికల్ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు. చివరి సంవత్సరం పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
◆ వయోపరిమితి : ఇండియన్ మిలటరీ అకాడెమీ, నేవల్ అకాడెమీలకు జులై 2, 2000 – జులై 1, 2005 మధ్య జన్మించినవారు అర్హులు.
ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు జులై 2, 2000 – జులై 1, 2004 మధ్య జన్మించినవారు అర్హులు.
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు జులై 2, 1999 – జులై 1, 2005 మధ్య జన్మించాలి.
◆ ఎంపిక విధానం : మొదటి దశలో రాతపరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా.
◆ దరఖాస్తు ఫీజు : 200/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు లేదు)
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తు గడువు : జూన్ – 06 – 2023 వరకు.
◆ పరీక్ష తేదీ : సెప్టెంబర్ – 03 – 2023.
◆ తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.
◆ వెబ్సైట్ : https://upsc.gov.in/