UoH ADMISSIONS : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో అడ్మిషన్లు

హైదరాబాద్ (ఆగస్టు – 10) : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) లో 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, పీహెచ్డీ ప్రోగ్రామ్ లలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

కోర్సులు : ఎంఎస్సీ, ఎంపీహెచ్, ఎంఏ, ఎంఈడీ, ఎంపీఏ, ఎంవీఏ,ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పీహెచ్డీ.

సబ్జెక్టులు: మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయాలజీ, యానిమల్ బయాలజీ, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఇంగ్లిష్, హిందీ, ఫిలాసఫీ, తెలుగు తదితరాలు.

◆ వివరాలు

మొత్తం సబ్జెక్టులు: 45

మొత్తం సీట్ల సంఖ్య: 1346.

అర్హత: సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీతో పాటు సీయూఈటీ (పీజీ)-2023 స్కోరు సాధించి ఉండాలి.

ఎంపిక విధానం : కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సీయూఈటీ (పీజీ) – 2023 స్కోర్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ. 300; ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.125.

ఆన్లైన్ దరఖాస్తుకు గడువు 12-08-2023.

ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 21-08-2023.

ఇంటర్వ్యూ తేదీలు: 30-08-2023 నుంచి 01-09-2023 వరకు.

అడ్మిషన్ కౌన్సెలింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ: 14-09-2023.

ఇంటర్వ్యూ లేని పీజీ ప్రోగ్రామ్ అడ్మిషన్ షెడ్యూల్:

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12-08-2023.

అడ్మిషన్ కౌన్సెలింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ: 11, 12, 13-09-2023.

వెబ్సైట్: http://acad.uohyd.ac.in/