ఖమ్మం (మే – 21) : తెలంగాణ రాష్ట్రంలోని 12 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 1,335 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తాన్నారు. వీరందరినీ రెగ్యులర్ చేసే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీగా ఈరోజు ఖమ్మం పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని మీరు ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి స్పందిస్తూ కూనంనేని సాంబశివరావు గారు సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తానని అదేవిధంగా.. మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు సంపూర్ణ మద్దతు సిపిఐ పార్టీ ఇస్తుందని తెలియజేయడం జరిగిందని డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్ జెఎసి కన్వీనర్ డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్, డాక్టర్ కె.నరసింహారావు, డాక్టర్ టి. గోపి, డాక్టర్ M. శ్యాంబాబు, పేరెల్లి కోటి, పి. శ్రీనివాస్, పి..మధు, తదితరులు పాల్గొన్నారు.