వర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమ్మె నోటీస్

  • క్రమబద్ధీకరణ కోసం ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముందు ధర్నా

హైదరాబాద్ (జూన్ – 21) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 13 విశ్వవిద్యాలయాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు అందర్నీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి బుధవారం నాడు తెలంగాణ రాష్ట్రం ఉన్నత విద్యా మండలి భవనం ముందు ధర్నా కార్యక్రమాన్ని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ నుంచి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్, జేఏసీ వర్కింగ్ చైర్మన్ డాక్టర్ ఎం. రామేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 13 విశ్వవిద్యాలయాలలో 1,356 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తామన్నారని… వీరందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేయటం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 38 ద్వారా డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసినందును స్వాగతిస్తూ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు అందర్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది.

2015వ సంవత్సరంలో సర్కులర్ నెంబర్ 1059 ఆధారంగా యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా చేయటం జరిగిందని… కానీ ఈరోజు వరకు కూడా రెగ్యులరేషన్ ప్రక్రియ చేపట్టకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈనెల ఒకటో తారీకు నాడు ఉన్నత విద్యకు సంబంధించిన అధికారులతోని మీటింగ్ జరిగిందని ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా చలనం లేకపోవడం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది.

దీంతో పాటు ఈరోజు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆ లింబాద్రి గారికి, సెక్రటరీ డాక్టర్‌ శ్రీనివాసరావు గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని…14 రోజులలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభించక పోతే రాష్ట్రంలో ఉన్న 13 విశ్వవిద్యాలయాలలో సమ్మె చేస్తామని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీగా పిలుపునివ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ రాజేష్ ఖన్నా, చైర్ పర్సన్ పళ్ళ రేష్మా రెడ్డి, డాక్టర్ జి వెంకటేశ్వర్లు, వి. హర్షిత, ఆదిత్య మూర్తి, డాక్టర్ దశరథం,హరీష్, డాక్టర్ కర్ణాకర్, కృష్ణవేణి, డాక్టర్ బి నాగరాజు, పద్మ, జితేందర్, మసూద్, శిరీష, , మను, రాధిక,పద్మ, సాయి కృష్ణ ,కాళీ కృష్ణ మధుమిత, డాక్టర్ వి .వెంకటేష్,డాక్టర్ ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు