Home > UNCATEGORY > రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జీజేసీ వైరా విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జీజేసీ వైరా విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ

BIKKI NEWS (DEC. 23) : Uniform distribution in gjc wyra by rotary club. స్థానిక వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాలురుకు ఉచిత యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న అని స్థానిక వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి యల్. నవీన జ్యోతి తెలిపారు.

Uniform distribution in gjc wyra by rotary club

ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్, కాళ్ల ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కాళ్ల పాపారావు మాట్లాడుతూ… విద్యార్థులు ఎల్లప్పుడూ అందరు మంచిని కోరుతూ, తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పుడు అన్ని మంచి అలవాట్లు వస్తాయని తెలిపారు. తాము అందించే ఏకరూప దుస్తులు ధరించి సంతోషంగా చదువును కొనసాగించాలని కోరారు. అదేవిధంగా విద్యార్థులు తమ గ్రామంలో ఎవరైనా వికలాంగులు ఉన్న కండ్లు కనబడక బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైరా పట్టణంలోని వైష్ణవి ఫుడ్స్ అండ్ మిల్క్ చైర్మన్ ముత్తాడ మురళీధర్ మాట్లాడుతూ… తమ సంస్థ ద్వారా సమాజానికి వీలయినంత సాయం చేస్తామని తెలిపారు.

ఖమ్మం జిల్లా రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఎన్ రవీందర్ మాట్లాడుతూ… వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సహాయం చేయటం చాలా సంతోషమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు, ప్రముఖ వ్యాపారవేత్త పసుమర్తి రంగారావు, ప్రముఖ రొటేరియన్ భూషణ్ రావు, వైష్ణవి ఫుడ్స్ మేనేజర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.

కళాశాల నుంచి రోటరీ క్లబ్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కాళ్ల పాపారావు, మురళీధర్ లకు చిరు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీచింగ్, నాన్- టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు