UNIFORM CIVIL CODE : పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదానికి ప్రయత్నం.!

న్యూడిల్లీ (జూన్ – 30) : ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు (UNIFORM CIVIL CODE BILL) తేవాలని నిర్ణయించినట్లు సమాచారం.

లోక్ సభలో సంపూర్ణ మెజార్టీ ఉంది కనుక బిల్లు అమోదం పొందడం చాలా సులభం. కానీ రాజ్యసభలో ప్రస్తుతం 237 మంది సభ్యులు ఉన్నారు. బిల్లు ఆమోదానికి 119 ఓట్లు అవసరం. ప్రస్తుతం BJPకి 92 మంది MPలు ఉన్నారు. ఇతర పార్టీల మద్దతుతో 103 ఓట్లు అవుతాయి.