UNESCO సృజనాత్మక నగరాలుగా గ్వాలియర్, కోజికోడ్

BIKKI NEWS (నవంబర్ – 02) : ‘యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ’ (UCCN) జాబితాలో మన దేశంలోని గ్వాలియర్ (మధ్యప్రదేశ్), కోజికోడ్ (కేరళ)తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 55 నగరాలకు చోటు దక్కింది. అక్టోబరు 31న ‘ప్రపంచ నగరాల దినోత్సవం’ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. తాజా జాబితాతో కలిపి UCCN జాబితాలో 100 దేశాలకు చెందిన 350 సృజనాత్మక నగరాలు ఉన్నట్లయింది.

సంగీత విభాగంలో గ్వాలియర్, సాహిత్యం విభాగంలో కోజికోడ్ నగరావకు ఈ జాబితాలో చేర్చారు.

అభివృద్ధి విధానాల్లో సంస్కృతి, సృజనాత్మకతలకు పెద్దపీట వేస్తున్నందుకు, ప్రజలు కేంద్రంగా నగరాభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేయడంతో సరికొత్త అభ్యాసాలు చేస్తున్నందుకు వీటిని గుర్తిస్తున్నట్లు యునెస్కో తెలిపింది.

2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 68% మంది ప్రజలు నగరాలలోనే జీవిస్తారని యూనెస్కో అంచనా వేసింది.

నూతన 55 సృజనాత్మకత నగరాలు జాబితా

  • అసబా – సినిమా
  • అష్గాబత్ – డిజైన్
  • బంజా లుకా – సంగీతం
  • బట్టంబాంగ్ – గ్యాస్ట్రోనమీ
  • బిస్సౌ – సంగీతం
  • బోల్జానో – సంగీతం
  • బ్రెమెన్ – సాహిత్యం
  • బఫెలో సిటీ – సాహిత్యం
  • బుఖారా – క్రాఫ్ట్స్ మరియు జానపద కళ
  • Bydgoszcz – సంగీతం
  • కేన్ – మీడియా ఆర్ట్స్
  • కారకాస్ – సంగీతం
  • కాసాబ్లాంకా – మీడియా ఆర్ట్స్
  • కాస్టెలో బ్రాంకో – క్రాఫ్ట్స్ మరియు జానపద కళ
  • Cetinje – డిజైన్
  • చావోజౌ – గ్యాస్ట్రోనమీ
  • చియాంగ్ రాయ్ – డిజైన్
  • చాంగ్కింగ్ – డిజైన్
  • కాన్సెప్షన్ – సంగీతం
  • ద లాట్ – సంగీతం
  • ఫ్రిబోర్గ్ – గ్యాస్ట్రోనమీ
  • Gangneung – గ్యాస్ట్రోనమీ
  • గ్రెనడా [1] – డిజైన్
  • గ్వాలియర్ – సంగీతం
  • హెరాక్లియన్ – గ్యాస్ట్రోనమీ
  • హోబర్ట్ – సాహిత్యం
  • హోయి ఆన్ – క్రాఫ్ట్స్ మరియు జానపద కళ
  • Iasi – సాహిత్యం
  • ఇలోయిలో సిటీ – గ్యాస్ట్రోనమీ
  • ఇపో – సంగీతం
  • ఖాట్మండు – సినిమా
  • కోళికోడ్ – సాహిత్యం
  • కుటైసి – సాహిత్యం
  • మెక్సికాలి – సంగీతం
  • మాంటెక్రిస్టి – క్రాఫ్ట్స్ మరియు జానపద కళ
  • మాంట్రెక్స్ – సంగీతం
  • Nkongsamba – గ్యాస్ట్రోనమీ
  • నోవి సాడ్ – మీడియా ఆర్ట్స్
  • ఒకాయమా – సాహిత్యం
  • Ouarzazate – సినిమా
  • ఔలు – మీడియా ఆర్ట్స్
  • పెనెడో – సినిమా
  • రియో డి జనీరో – సాహిత్యం
  • Şanlıurfa – సంగీతం
  • సుఫాన్‌బురి – సంగీతం
  • సురకర్త – చేతిపనులు మరియు జానపద కళ
  • తైఫ్ – సాహిత్యం
  • టౌలౌస్ – సంగీతం
  • తుకుమ్స్ – సాహిత్యం
  • ఉలాన్‌బాతర్ – క్రాఫ్ట్స్ మరియు జానపద కళ
  • ఉమ్ంగేని హోవిక్ – క్రాఫ్ట్స్ మరియు జానపద కళ
  • వాలెన్సియా – డిజైన్
  • వరాజిన్ – సంగీతం
  • వెలికి నొవ్గోరోడ్ – సంగీతం
  • విసెంటే లోపెజ్ – సినిమా