రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ భవన్లో రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. సీఎం కేసీఆర్ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చన్నారు. ఇప్పటికే లక్ష 31 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లుగా తెలిపారు. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
Follow Us@