నిరుద్యోగ భృతిపై త్వరలోనే నిర్ణయం – సీఎం కేసీఆర్

నిరుద్యోగ భృతిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని శాసనసభలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనా కారణంగా రాష్ట్రంపై దాదాపు లక్ష కోట్ల రూపాయల భారం పడిందన్నారు.

ముందుగా నిరుద్యోగులు అంటే నిర్వచనం తేల్చాలనే ఉద్దేశంతో విధివిధానాలు ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. అయితే అదే సమయంలోనే కరోనా వచ్చిందని ఈ నేపథ్యంలో ఉద్యోగులకు వేతనాలే సరిగా ఇవ్వలేకపోయామన్నారు.

కరోనా లాంటి గడ్డు పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి ఇవ్వడం ప్రభుత్వానికి సాధ్యం కాలేదని సీఎం వెల్లడించారు. నిరుద్యోగులకు ఇచ్చే భృతిపై రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని అన్నారు.

Follow Us@