HDI RANKINGS 2021 – భారత్ లో దిగజారుతున్న మానవాభివృద్ధి

హైదరాబాద్ (సెప్టెంబర్ – 09) : ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) విడుదల చేసిన మానవాభి వృద్ధి సూచీక 2021 (HDI RANKINGS) లో భారత ర్యాంకు 191 దేశాలకు గానూ 132వ స్థానంలో నిలిచింది. 2020 పోలిస్తే ఒక ర్యాంకు దిగజారింది. 2020లో భారత్ ర్యాంకు 131 కాగా, 2019లో 129వ ర్యాంక్ లో ఉంది.

మానవాభివృద్ది సూచిక 2021లో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్ ల్యాండ్ మొదటి మూడు స్థానాలలో నిలిచాయి. దక్షిణ సూడాన్, చాద్, నైగర్ దేశాలు చివరి మూడు స్థానాలలో నిలిచాయి.

మన పొరుగు దేశాలలో పాకిస్థాన్ తప్ప మిగతా దేశాలు భారత్ కంటే మెరుగైన స్థానాలలో ఉన్నాయి.