అగ్రికల్చర్, హర్టీకల్చర్, వెటర్నరీ కోర్సుల మెరిట్ లిస్ట్ విడుదల

హైదరాబాద్ (జూలై – 14) : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (PJTSAU)), శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (SKLTSHU)(ములుగు, సిద్ధిపేట జిల్లా), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (PVNRTVU) లలో 2023 – 24 విద్యా సంవత్సరానికి వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేయడం జరిగింది.

మెరిట్ జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు ఆగస్టు 18 సాయంత్రం 5.00 గంటల లోపు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ సీట్ల కోసం ఎంసెట్ – 2023 బైపీసీ స్ట్రీమ్ రాసిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ నోటిఫికేషన్ ద్వారా కింది కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

  • బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ (నాలుగేళ్లు),.
  • బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్(4 ఏళ్ళు),
  • బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ (నాలుగేళ్లు)
  • BFSc (4 ఏళ్ళు)
  • BVSc & AH (5.1/2 ఏళ్ళు)

MERIT LIST DOWNLOAD HERE

◆ వెబ్సైట్: https://www.pjtsau.edu.in/