న్యూఢిల్లీ (ఎప్రిల్ – 20) : దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో అభ్యసిస్తున్న విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో కోర్సులు అభ్యసించినా, ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసేందుకు అనుమతించాలని యూజీసీ చైర్మన్ జగదీశ కుమార్ అన్ని సెంట్రల్ వర్సిటీలకు బుధవారం లేఖ రాశారు.
బోధన, అభ్యసన ప్రక్రియల్లో స్థానిక, ప్రాంతీయ భాషల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వర్సిటీలు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇతర భాషల నుంచి స్థానిక భాషల్లోకి పుస్తకాల అనువాదాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ‘ఒకసారి స్థానిక భాషల్లో టీచింగ్, లర్నింగ్, అసెస్మెంట్ పూర్తయితే విద్యార్థి సక్సెస్ రేటును పెంచుతుంది. ఇది 2035 నాటికి విద్యార్థుల నమోదు(జీఆస్ఈ)ను 50 శాతానికి పెంచే లక్ష్యాన్ని సాధించేందుకు తోడ్పడుతుందని’ అని ఆయన అన్నారు.